Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యేడాదిగా వేర్వేరుగా ఉంటున్నారా.. అయితే విడాకులు ఇవ్వొచ్చు : మద్రాస్ హైకోర్టు

భార్యాభర్తలు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా నివశిస్తుంటే.. వారికి తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు కీలక తీర్పును వెలువరించారు.

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (11:31 IST)
భార్యాభర్తలు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా నివశిస్తుంటే.. వారికి తక్షణం విడాకులు మంజూరు చేయవచ్చని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా ఓ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు కీలక తీర్పును వెలువరించారు. 
 
తమిళనాడులోని ఓ యువతీయువకుడు 2013 మేలో పెళ్లి చేసుకున్నారు. కానీ... 2014 జూలై నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపడంతో 2015లో ఇద్దరూ కలిసి విడాకుల కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను తిరునల్వేలి ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. విడాకులు పొందడానికి సరైన కారణాలను చూపలేదంటూ కోర్టు వారి పిటీషన్‌ను తోసిపుచ్చింది. 
 
దీంతో వారిద్దరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని అనుకుంటే.. కోర్టు అందుకు కారణాలను వెతకాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక కోర్టు నిజనిర్ధారణ కోసం పట్టుబట్టనక్కర్లేదని జస్టిస్ కేకే శశిధరన్, జస్టిస్ ఎన్.గోకుల్‌దాస్‌లతో కూడిన డివిజన్ బెంచి తెలిపింది. 
 
ముఖ్యంగా.. విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి యేడాది ముందు నుంచి వాళ్లు విడిగానే ఉంటున్నారు కాబట్టి ఇక వారు కలిసి జీవించే అవకాశం లేదని, ఇక వాళ్లకు విడాకులు మంజూరు చేయడం తప్ప కోర్టుకు కూడా వేరే అవకాశం లేదని న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments