ప్రధానమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ : బీజేపీ నేత ప్రతిపాదన

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (16:04 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ.. పశ్చిమ్‌బంగ రాష్ట్రం నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతా బెనర్జీ ఆ పదవికి ఉత్తమ ఎంపిక అని వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ 'ప్రధాని అభ్యర్థిని పశ్చిమ్‌బంగ నుంచి ఎన్నుకుంటే.. మమతానే ఉత్తమ ఎంపిక. ప్రధాని కావాలని ఆమె కలలు కంటున్నారు. ఆమెకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నా. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే.. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడతారు' అని ఘోష్‌ వ్యాఖ్యానించారు. 
 
'గతంలో పశ్చిమ్‌ బంగ నుంచి ప్రధాని అయ్యే అవకాశం జ్యోతిబసుకు వచ్చింది. సీపీఎం అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు బెంగాల్‌ నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటే.. మమతకే మొదటి అవకాశం' అని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని మమత అడ్డుకున్న విషయాన్ని కూడా ఎవరూ మరిచిపోలేరని ఆయన గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments