Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఏఏ - ఎన్నార్సీ - ఎన్పీఆర్ వెనక్కి తీసుకోవాల్సిందే : మోడీని కోరిన మమతా

Webdunia
ఆదివారం, 12 జనవరి 2020 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా, ఎన్పీఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరారు. 
 
మోడీతో సమావేశం తర్వాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. 
 
దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల నిధులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఈ అంశాలపై చర్చించేందుకు తనను ఢిల్లీకి రావాల్సిందిగా ప్రధాని కోరారని చెప్పారు. 
 
రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీని అమలు చేయబోమన్నారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్‌పై స్పందిస్తూ... సీఏఏ ఇకపై కాగితాలకే పరిమితమవుతుందన్నారు. మరోవైపు ప్రధానితో మమత భేటీని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుబట్టాయి. మమత ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోమన్ మిత్రా విమర్శించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments