Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయ్ మాల్యా: నాకు న్యాయం జరగదని?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (08:50 IST)
లిక్కర్ కింగ్, ఎంపీ విజయ్ మాల్యా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకు బకాయిపడిన విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టబద్ధంగా విచారణ జరిగి తనకు న్యాయం జరగదని ఇటీవలి సంఘటనలు తేల్చేయడంతో.. తక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ ద్వారా సమాచారం చేరవేశారు.
 
రాజ్యసభ ఎథిక్స్ కమిటీ మాల్యాను సభ నుంచి బహిష్కరిస్తూ మంగళవారం సిఫార్సు చేయనున్న నేపథ్యంలో ఓ రోజు ముందు స్వయంగా ఆయనే తప్పుకున్నారు. ఇకపోతే.. రెండోవిడత ఎంపీగా ఇండిపెండెంట్‌గా గెలిచిన విజయ్ మాల్యా పదవీకాలం జూలై 1వ తేదీతో ముగియనుంది. 
 
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.9,400 కోట్లకుపైగా రుణాలు ఎగవేసి బ్రిటన్‌ పరారైన మాల్యాపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments