Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం.. భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను..

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:54 IST)
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 120 మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ.. ప్రభుత్వానికి చెందిన ఓ స్టీమర్‌ను ఢీకొట్టి మునిగిపోయింది. జోర్హాత్‌ జిల్లాలోని నీమతి ఘాట్‌ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇప్పటివరకూ 50 మందిని రక్షించామని, 70 మంది వరకు గల్లంతైనట్టు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) డిప్యూటీ కమాండర్‌ శ్రీవాస్తవ తెలిపారు. 
 
రాష్ట్ర జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌)తో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. పడవ ప్రమాదంలో ఒక మహిళ మరణించినట్టు జోర్హాత్‌ ఎస్పీ అంకూర్‌ జైన్‌ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరుగొచ్చన్నారు. 
 
పడవ ఢీకొన్న స్టీమర్‌లో ఉన్న లైఫ్‌గార్డుల సాయంతో కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చినట్టు వెల్లడించారు. పడవలో ఉన్న వాహనాలు, బైకుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. కాగా పడవ మునిగిపోతున్న సమయంలో ప్రాణాలను రక్షించుకోవడానికి కొందరు నదిలో దూకుతున్నట్టు వీడియోల్లో రికార్డయ్యింది.
 
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అందరి భద్రత, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను. అస్సాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను పిలిచి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను ఆయనకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments