Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ సీఎం ఎలా అవుతారో చూస్తా.. ఎక్కడ పోటీ చేసినా నేను బరిలో ఉంటా : జయ మేనకోడలు దీపా

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ గట్టి షాక్ ఇచ్చారు. శశికళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అవుతారో తాను చూస్తానంటూ హెచ్చరించారు. పైగా శశికళ ఎక్కడ నుంచి పో

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (08:33 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ గట్టి షాక్ ఇచ్చారు. శశికళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అవుతారో తాను చూస్తానంటూ హెచ్చరించారు. పైగా శశికళ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆ స్థానం నుంచి తాను కూడా పోటీ చేసితీరుతానని స్పష్టం చేశారు. 
 
స్థానిక టీ నగర్‌లోని దీపా నివాసం ఇపుడు శశికళ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలతో నిత్యం సందడిగా ఉంది. తనకు మద్దతునిచ్చేందుకు ఇంటికి వస్తున్న వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ఆమె వారి వద్ద అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ మా మేనత్తకు మా కుటుంబాన్ని దూరం చేసిన వారు ఎవ్వరూ బాగుపడరని ఆమె శాపనార్థాలు పెట్టారు. 
 
జయలలిత ప్రాతినిథ్య వహించిన ఆర్కే నగర్ శాసనసభ నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా అని మీడియా దీపాను ప్రశ్నిస్తే తాను శశికళ పోటీ చేసే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. మొత్తం మీద దీపా జయకుమార్ తన మేనత్తను దూరం చేసిన శశికళ మీద రాజకీయంగానే కక్ష తీర్చుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు. దీపా జయకుమార్‌కు ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు వస్తున్నది. 
 
ఈ సమయంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ శశికళ పోటీ చేసే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో చిన్నమ్మ అనుచరులు షాక్‌కు గురైనారు. అధికారంలో ఉన్న తామే ఎలాగైనా శశికళను గెలిపించుకుంటామని చిన్నమ్మ అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments