Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ప్రియుడి కోసం ఇల్లు వదిలి వెళ్లిన మహిళ... చివరకు శవమై తేలింది...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (10:00 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత ఇల్లు వదిలి వెళ్లింది. చివరకు అతని చేతిలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహలో జరిగింది. మృతురాలు నిజామాబాద్ వాసి. పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ఫేస్‌బుక్ ప్రియుడు ఆమెను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ఓ కంపెనీ ఆవరణంలో పడేసి ఏమీ తెలియనట్టుగా వెళ్లిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్‌కు చెందిన ఉస్మా బేగం (32)కు షెహజాద్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన అతడిని కలిసి ఉస్మా బేగం‌ గజరౌలా చేరుకుంది షెహజాద్‌ను కలిసి ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు అతడు ససేమిరా అన్నారు. అయినప్పటికీ ఒత్తిడి చేయడంతో ఆమె మెడలో వేసుకున్న దుపట్టాతో కట్టేసి ఇటుక రాయితో తలపైబలంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ ఆవరణలోనే ఓ మూలన పడేశాడు. 
 
అయితే, తన భార్య కనిపించడం లేదంటూ ఉస్మాబేగం భర్త ముఖీద్ ఈ నెల 6వ తేదీన బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఆమె ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉస్మాబేగం యూపీలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడకు వెళ్లి చూడగా ఆమ శవమై కనిపించింది.
 
కాగా, ముఖీద్‌కు ఉస్మాబేగంకు 12 యేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తతడంత రెండు నెలులుగా ఉస్మాబేగం నిజామాబాద్‌లో ఉంటుంది. ఆ తర్వాత పెద్దలు రాజీ కుదిర్చినప్పటికీ ఆమె మాత్రం తన ఫేస్‌బుక్ ప్రియుడి కోసం యూపీకి వెళ్లి శవమై తేలింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments