Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డ్రగ్స్: జర్నలిస్ట్‌ను చంపేందుకు.. ఇంటర్నెట్లో ఫత్వాజారీ చేసిన డ్రగ్స్ పెడ్లర్

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న హైదరాబాదులో డ్రగ్స్ దందా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆంగ్లపత్రిక జర్నలిస్టు డార్క్ సైట్ ద్వారా దందా జరుగుతుందని విషయాన్ని శోధించి తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో కథనం రాశా

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (09:24 IST)
టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న హైదరాబాదులో డ్రగ్స్ దందా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆంగ్లపత్రిక జర్నలిస్టు డార్క్ సైట్ ద్వారా దందా జరుగుతుందని విషయాన్ని శోధించి తెలుసుకున్నారు. పూర్తి వివరాలతో కథనం రాశాడు. ఈ జర్నలిస్టును చంపేందుకు డ్రగ్స్ దాదా డీల్ కుదుర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. భారత్‌కు మ్యాడ్లీబూటెడ్‌ ఐడీతో పెడ్లర్ ఒకరు భారీగా మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్నాడు. దీనికి సంబంధించి స్టోరీని ఓ జర్నలిస్ట్ రాశాడు. ఈ స్టోరీ జర్నలిస్టు పేరుతో సహా ప్రసారమైంది.
 
అంతే ఈ స్టోరీ చదివిన సదరు డ్రగ్ పెడ్లర్.. ఇంటర్నెట్‌లో ఫత్వా జారీ చేశాడు. ఫేస్ బుక్ ద్వారా సదరు జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యుల వివరాలు సేకరించాడు. ఇంకా అతనిని చంపేందుకు దాదాపు రూ.8లక్షల మేర ఇస్తానని రేటు ఫిక్స్ చేశాడు. అతనితో పాటు అతని కుటుంబ సభ్యుల్ని కూడా చంపేస్తే రూ.11 లక్షలిస్తానని డీల్ కుదిర్చాడు. దీనిని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకున్న సదరు జర్నలిస్టు సిట్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఐపీ అడ్రస్ ద్వారా డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments