Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లిని గర్భవతిని చేసిన అన్నలు.. ఎక్కడ?

హైటెక్ ప్రపంచంలో మానవసంబంధాలు మంటగలిసి పోతున్నాయి. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికే మచ్చతెచ్చేలా కొందరు కామాంధులు క్రూరమృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరిచిపోయి.. పశువుల్లా నడుచుకుంటున్నారు.

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (08:38 IST)
హైటెక్ ప్రపంచంలో మానవసంబంధాలు మంటగలిసి పోతున్నాయి. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికే మచ్చతెచ్చేలా కొందరు కామాంధులు క్రూరమృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వావివరుసలు మరిచిపోయి.. పశువుల్లా నడుచుకుంటున్నారు. తాజాగా హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ జిల్లాలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాకు చెందిన 15 యేళ్ళ బాలిక గతేడాది డిసెంబర్‌లో ఇంటి దగ్గర ఒంటరిగా నివశిస్తోంది. ఈమెపై ఆ బాలిక బాబాయ్ కుమారులిద్దరూ కన్నేశారు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని పలు రకాల ఎత్తులు వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇంటిపై ఆరేసిన బట్టలను తీసుకువచ్చేందుకు మిద్దెపైకి ఆబాలిక వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ఆమె సోదరులిద్దరూ(బాబాయి కుమారులు) యువతిని బలవంతంగా టెర్రస్‌పై ఉండే గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్పితే చంపేస్తామని బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు సోదరుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఆ బాలికను పలుమార్లు లైంగికంగా అనుభవిస్తూ వచ్చారు. అయితే, ఆ బాలికకు ఇటీవల కడుపు నొప్పి రావడంతో ఆమెను చికిత్స నిమిత్తం తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.
 
ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో బాధితురాలు ఏడు నెలల గర్భవతి అని తేలడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలు, ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒక యువకుడి(మైనర్)ని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కి తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం