Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త పరిస్థితి అది.. లోబరుచుకుని.. స్నేహితులతో వివాహితపై గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (12:31 IST)
మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి. తాజాగా ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. నిస్సహాయురాలైన ఓ వివాహితను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి తాను అత్యాచారం చేయడమేకాక, మరో ఇద్దరు స్నేహితులను ఆమెపై ఉసిగొల్పిన కామాంధుడి తీరు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌కు చెందిన ఓ వివాహిత (33) హైదరాబాద్‌లో భర్త, కొడుకుతో నివాసం ఉంటోంది. 
 
భర్త మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని నెట్టేస్తోంది. ఏడాది క్రితం ఈమెకు జగిత్యాలకు చెందిన నగేష్‌తో పరిచయం అయింది. తరచూ వీరు ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఆమెతో మాట్లాడిన సంభాషణలను నగేష్ రికార్డ్ చేశాడు. కొన్నాళ్ల తరువాత సదరు వివాహితను లోబర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 
 
ఆమె తిరస్కరించడంతో ఫోన్‌ సంభాషణలు బయట పెడతానంటూ బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. భయపడిన ఆమె మెత్తపడగానే జగిత్యాలకు రావాల్సిందిగా కోరాడు. అతను చెప్పినట్లే ఆమె ఆదివారం జగిత్యాల వెళ్లగా ఆమె బిడ్డను వేరొక వ్యక్తికి అప్పగించాడు. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను తెచ్చి జగిత్యాల బస్టాండ్‌లో బిడ్డతోపాటు వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం