Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్య, ఎక్కడ?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (21:46 IST)
తన భర్త ఓ యువతిని ప్రేమించాడన్న విషయాన్ని తెలుసుకున్న భార్యామణి భర్తకు విడాకులిచ్చి ఆ ప్రియురాలితో పెళ్లి జరిపించింది. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో జరుగుతుంటాయి. కానీ ఇక్కడ నిజ జీవితంలోనే జరగడం ఆశ్చర్యానికి దారితీసింది. ఈ ఆసక్తికర ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది.
 
వివరాలిలా వున్నాయి. భోపాల్ లోని ఓ ప్రేమ జంటకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే తన భర్త గతంలో ఓ యువతిని ప్రేమించినట్లు ఆమె తెలుసుకుంది. పెళ్లయినా ఆమెను తన భర్త మరిచిపోలేకపోతున్నాడని ఆమె గుర్తించింది. అయితే ఏదో ఒక రోజు ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని మనం ముగ్గరం కలిసి ఆనందంగా జీవిద్దామని భార్యకు ఆయన చెప్పాడు.
 
అయితే మనం ముగ్గరం కలిసి జీవించేందుకు చట్టం ఒప్పుకోదని ఆమె చెప్పింది. దీంతో ఆమె మూడేళ్ల వైవాహిక జీవితాన్ని వదులుకోవడానికి సిద్దమైంది. తన భర్తకు విడాకులు ఇచ్చి ఆయన ప్రియురాలితో వివాహం జరిపించింది. ఈ విడాకులు గురించి లాయర్ మాట్లాడుతూ ఆమె చాలా ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. భార్య చేసిన త్యాగాన్ని పలువురు మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments