Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం... భర్త ఎడబాటును తట్టుకోలేక...

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (11:45 IST)
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత యేడాదిగా గుట్టుగా సంసారం జీవితాన్ని గడుపుతున్నారు. ఇంతలో రోడ్డు ప్రమాదం రూపంలో భర్త మృత్యుఒడిలోకి చేరాడు. దీంతో ఆ మహిళ కుంగిపోయింది. భర్త లేని జీవితం తనకూ వద్దంటూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన అయోధ్య నగర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాచపూడి నాగరాజు (27) స్థానికంగా ఉన్న ఓ హోటల్లో టిఫిన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. అయోధ్య నగర్‌కు చెందిన చల్లా ఉష (22)ను ప్రేమించారు. వీరిద్దరూ ఏడాది కిందటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయోధ్య నగర్‌లో కాపురం పెట్టారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు భర్త హోటల్‌కు వెళ్లి.. రాత్రి 11 గంటల తర్వాత ఇంటికి వచ్చేవారు. 
 
సోమవారం పనికి వెళ్లి, అర్థరాత్రి అయినా ఇంటికి రాలేదు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బి. ఆర్.టి.ఎస్. రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు భార్యకు సమాచారం వచ్చింది. ఉష తన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లారు. విగతజీవిగా పడివున్న భర్తను చూసేసరికి తట్టుకోలేకపోయారు. 
 
గుండెలవిసేలా రోదించారు. గుణదల కుమ్మరిబజారుకు చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై.. భానునగర్ కూడలి నుంచి పడవలరేవు వైపు రాంగ్ రూట్లో అతి వేగంగా వెళుతూ నాగరాజు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. 
గాయాలతో వారు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద తీవ్రతకు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
 
ఈ ఘటనపై మృతుడి భార్య ఉష.. గుణదల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో.. ఇంటికి వెళ్లొస్తానని ఉష తన తల్లి ఆదిలక్ష్మి చెప్పి వెళ్లారు. కొద్ది సేపటికి తల్లికి అనుమానం వచ్చి కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది. 
 
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. భర్త మరణాన్ని తట్టుకోలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదిలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం.. ప్రేమికుల ప్రాణాలను బలిగొంది. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments