Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం పెనుభూతమైంది.. భార్యను ముక్కలుగా నరికేసిన భర్త

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (11:00 IST)
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ హోటల్ గదిలో మహిళ దారుణ హత్యకు గురైన కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కట్టుకున్న భర్తేనని తేలింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను ఒక లాడ్జీ గదికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. తాను పోలీసులకు చిక్కకుండా, మృతురాలిని గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా తల, చేతిని వేరు చేశాడు. ఆ తర్వాత అక్కడ పారిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. 
 
ఇటీవల యూపీలోని పన్వేల్‌కు చెందిన పూనమ్, రాంపాల్ అనే వారికి యేడాది క్రితం వివాహమైంది. పూనమ్ స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. వివాహమైన తర్వాత వీరిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇది పెనుభూతమైంది. 
 
ఈ క్రమంలో గత ఆదివారం భార్యను తీసుకుని రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న లాడ్జీకి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరినట్టు తెలుస్తోంది. దీంతో నిగ్రహం కోల్పోయిన భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఈ కేసులో తాను చిక్కకుండా ఉండేందుకు ఆమె తలను, పచ్చబొట్టు ఉన్న చేతిని నరికేశాడు. తర్వాత ఆమెను వివస్త్రను చేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... లాడ్జికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ లేడీ హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించారు. అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు పూనమ్‌గా గుర్తించారు. ఆ తర్వాత భర్తను గాలించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments