Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో మనస్పర్థలతో పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య.. తాగుడికి బానిసై.. కత్తితో దాడి..

భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త ఎంత పిలిచినా సంసారం చేయనని చెప్పింది. ఆ కోపంతో ఓ రైతు తాగుబోతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా మద్యం మత్తులో భార్య, కూతురిపై కత్తితో దాడి

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (08:52 IST)
భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త ఎంత పిలిచినా సంసారం చేయనని చెప్పింది. ఆ కోపంతో ఓ రైతు తాగుబోతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా మద్యం మత్తులో భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడు. తిరునల్వేలి జిల్లా ఆలంగుళం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆలంగుళం మరుదపురానికి చెందిన వినాయగం (60) వ్యవసాయం చేస్తుంటాడు. ఆయనకు సెల్లమ్మాళ్‌ (55) అనే భార్య, కౌసల్య (28) అనే కుమార్తె ఉన్నారు. కౌసల్యకు కొన్ని సంవత్సరాల క్రితం మురుగన్ అనే వ్యక్తితో వివాహం కాగా వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
 
మురుగన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా కౌసల్య తన పిల్లలతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. భర్తను వదిలేసిన కూతురు ఇంట్లో ఉండడంతో మనస్తాపానికి గురైన వినాయగం మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఉదయం మద్యం సేవించి ఇంటికొచ్చిన వినాయగం భార్య సెల్లమ్మాళ్‌తో గొడవపడ్డాడు. కౌసల్యకు పెళ్ళి చేసి దాని జీవితాన్ని నాశనం చేశావంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి సెల్లమ్మాళ్‌ను వినాయగం చేయిచేసుకోవడంతో ఆమె కూడా అతనిపై దాడిచేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వినాయగం పక్కనే ఉన్న కత్తితో సెల్లమ్మాళ్‌పై దాడిచేశాడు. దీన్ని అడ్డుకోబోయిన కౌసల్య పై కూడా కత్తితో దాడిచేశాడు. 
 
ఈ దాడిలతో ఇరువురూ రక్తపుమడుగులో కుప్పకూలారు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని గాయపడిన వారిని తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిని ఆస్పత్రికి తరలించిన తర్వాత ఆందోళన చెందిన వినాయగం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసిన ఆలంగుళం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments