Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్లీలో యూపీ రైతుల భారీ ర్యాలీ

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:49 IST)
ఉత్తర్​ప్రదేశ్ రైతులు దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్దకు భారీగా తరలివచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరసన చేపట్టారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న చెరకు పంట బకాయిలు, రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉత్తర్​ప్రదేశ్​ రైతులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడం లేదని నిరసనలు చేపట్టారు. యూపీ నోయిడాలోని సెక్టార్-69 నుంచి దిల్లీలోని కిసాన్ ఘాట్​ వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న చెరకు పంట బకాయిల చెల్లింపు, రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్... యూపీ రైతుల ప్రధాన డిమాండ్లు.

రైతుల ర్యాలీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులతో యూపీ రైతులు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

అనంతరం దిల్లీలో ర్యాలీ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు రైతులు. ఆందోళనల దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్​ సర్కార్​ అప్రమత్తమైంది. అక్టోబరు 31 లోగా రైతులకు బకాయిలు చెల్లించాలని చక్కెర మిల్లుల యజమానులను ఆదేశించింది. చెరకు సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది యూపీ.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments