Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతులకు జగన్‌ అన్యాయం..దేవినేని ఉమ

రైతులకు జగన్‌ అన్యాయం..దేవినేని ఉమ
, శనివారం, 7 సెప్టెంబరు 2019 (09:14 IST)
సీఎం జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరాన్ని ఆపి… రైతులకు అన్యాయం చేశారన్నారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావును తప్పించడం అన్యాయమని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌తో వ్యయం పెంచి దోచిపెట్టడం తప్ప… చేసేదేం లేదని వ్యాఖ్యానించారు.

కాంట్రాక్ట్‌ మార్చుతూ పోతే డ్యామ్‌ భద్రతకు బాధ్యత ఎవరిది? అని అడిగారు. చంద్రబాబు పేరు కన్పించకుండా చేయాలన్నదే జగన్‌ అక్కసు అని చెప్పారు. "వైసీపీ నేతల దుశ్చర్యలతో 70 ఏళ్ళ రాజ్యాంగం, 73 ఏళ్ళ స్వాతంత్య్రం పరిహాసం పాలయ్యాయి.

రక్తం చిమ్మి, ఎముకలు జల్లి యజ్ఞాలను భగ్నం చేయడం పురాణాల్లో విన్నాం. అంతకు మించిన రాక్షస కృత్యాలను ఇప్పుడే చూస్తున్నాం. దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా నివసించే హక్కుంది. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకునే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది.

అలాంటిది వైసీపీ వాళ్ల బెదిరింపులతో సొంత ఊళ్లు వదిలేసి పరాయి గ్రామాల్లో తలదాచుకోవాలా? నచ్చిన పార్టీకి ఓటేస్తే చంపేస్తారా? ఆత్మగౌరవంతో జీవించే హక్కును కాలరాస్తారా? పంట పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? రోడ్లకు అడ్డంగా గోడలు కడతారా? అయిదారేళ్లు కష్టపడి పెంచిన చీని చెట్లను నరికేస్తారా?

పాడి గేదెలకు విషం పెట్టి చంపుతారా? ఎస్సీలు, ముస్లిం మైనారిటీల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? బోర్లు పూడ్చేయడం, పైపులు కోయడం..ఇవన్నీ రైతు కష్టం తెలిసినవాళ్లు చేసే పనులేనా? మానవత్వం ఉన్నవారంతా ఈ అరాచకాలను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడాలి" అని మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్-2 : 2022లో చంద్రుడిపైకి ఇండియన్.. అక్కడే ఇస్రో ఎందుకు అడుగుపెడుతోంది?