Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా అమర జవాన్లకు రూ. 110 కోట్ల భారీ విరాళం... ఆయన దేవుడు కాక మరేమిటి?

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (20:36 IST)
మానవ సేవే మాధవ సేవ అన్నారు. కష్టాల్లో వున్న తోటివారిని ఆదుకున్నవారిలో సాక్షాత్తూ భగవంతుడు కొలువై వుంటాడని అంటారు. అలాంటివారిలో ఓ మహానుభావుడు... పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 110 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఆయన అంధుడు. సైంటిస్ట్.
 
వివరాల్లోకి వెళితే... ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రవాద దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశ ప్రజలు తమవంతు సాయం చేస్తున్నారు. ఐతే రాజస్థాన్ కోటాకు చెందిన ముర్తజా ఏ అహ్మద్ భారీ సాయం ప్రకటించి అమరవీరుల కుటుంబాల పట్ల దాతృత్వాన్ని చూపారు. 
 
రూ. 110 కోట్లను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెయిల్ ద్వారా తెలియజేశారు. ఈయన అంధులైనప్పటికీ శాస్త్ర పరిశోధనలో వినూత్న ఆవిష్కరణలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఆధునాతన టెక్నాలజీని త్వరలో ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. మరోవైపు భారీ విరాళం ప్రకటించిన ఆయనను ఆ దేవుడు చల్లగా వుండాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments