ఇంటికి రాని బాలికను వెతుక్కుంటూ వెళ్లిన తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. బయోగ్యాస్ ట్యాంక్‌లో శవం కనిపించింది. బుధవారం తన సమీప బంధువుతోపాటు వెళ్లిన బాలిక తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు అతడిని అడిగారు. అతడు తనకు తెలియదని, పాప ఇంటికి వచ్చేసిందనుకున్నానని సమాధానమిచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని పట్టణంలో చోటుచేసుకుంది.
బాలిక కోసం తల్లిదండ్రులు వెతికినా కనిపించలేదు. కట్నికి 80 కిమీ దూరంలో ఓ బయోగ్యాస్ ట్యాంక్ ఉంది. అందులో నుండి దుర్వాసన వస్తుండటంలో వెళ్లి చూసిన రైతుకు 10 ఏళ్ల బాలిక శవం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అది తప్పిపోయిన బాలికదే అని నిర్ధారించుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల ప్రకారం, బాలిక రోడ్డుపై వెళుతుండగా కొందరి కామాంధుల కళ్లు పాపపై పడ్డాయి. ఆమెను వెంబడించిన దుండగులు, నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక, బాలికపై అఘాయిత్యానికి దిగారు. నోరుని గట్టిగా మూసి తుప్పల్లోకి తీసుకువెళ్లారు. అత్యాచారానికి ఒడిగట్టి గొంతు నులిమి చంపేశారు. శవాన్ని తీసుకువెళ్లి బయో గ్యాస్ ట్యాంక్‌లో పడేసి అక్కడ నుండి పారిపోయారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.