Webdunia - Bharat's app for daily news and videos

Install App

207 కేజీల హై ప్యూరిటీ డ్రగ్స్ స్వాధీనం.. విలువ రూ.1476 కోట్లు

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (16:39 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోమారు భారీ మొత్తంలో డ్రగ్స్‌‍ పట్టబడ్డాయి. 207 కేజీల హై ప్యూరిటీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ.1476 కోట్లుగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అలాగే, ఈ డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్న దిగుమతిదారుడిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేశారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సౌతాఫ్రికా నుంచి వచ్చినట్టు డీఆర్ఐ అధిగారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
నవీ ముంబైలో భారీ మొత్తంలో డ్రగ్స్ చేతులు మారుతున్నట్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో పక్కాగా నిఘా వేసిన అధికారులు... 198 కేజీల హై ప్యూటిరీ క్రిస్టల్ మెథాంఫెటమైన్, 9 కేజీల హై ప్యూరిటీ కొకైన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ మాదకద్రవ్యాల విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్‌ను వాలెన్షియా రకం విదేశీ కమలా ఫలాల బాక్సుల్లో ఉంచి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. 
 
కాగా, ఈ హై ప్యూరిటీ డ్రగ్స్ తీసుకున్నవారికి ఆ మత్తు 12 గంటల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు
 
ఈ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్న వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన కస్టమ్స్ హౌస్ ఏజెంట్ కోసం, స్థానిక మాదకద్రవ్యాల నెట్ వర్క్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments