Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశంలో అద్భుతం... సుదీర్ఘం సంపూర్ణ చంద్రగ్రహణం

అకాశంలో అద్భుతం జరుగనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా 6 గంటలకుపైగా చంద్రగ్రహణం కనిపించనుంది. 103 నిమిషాల పాటు పూర్తిగా రక్త వర్ణంలో జాబిలి కనిపించనుంది. ఆ పక్కనే నేనున్నానంటూ మినుకుమినుకుమంటూ మెర

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (09:48 IST)
అకాశంలో అద్భుతం జరుగనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘంగా 6 గంటలకుపైగా చంద్రగ్రహణం కనిపించనుంది. 103 నిమిషాల పాటు పూర్తిగా రక్త వర్ణంలో జాబిలి కనిపించనుంది. ఆ పక్కనే నేనున్నానంటూ మినుకుమినుకుమంటూ మెరిసే అంగారకుడు. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించే అరుదైన సందర్భం.. మన దేశంలో ఎక్కడి నుంచైనా సంపూర్ణ గ్రహణాన్ని చూసే అవకాశం.. ఇన్ని ఆకాశ అద్భుతాలకు శుక్రవారం రాత్రి వేదిక కాబోతున్నది.
 
ఇదేసమయంలో గ్రహణంపై అపోహలు తొలిగించేందుకు దేశవాసులంతా గ్రహణం సమయంలో ఆహారం తింటూ సెల్ఫీలు తీసుకోవాలని, సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయాలని శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు. 21వ శాతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి ప్రారంభంకానుంది. 
 
ప్రారంభం నుంచి చివరివరకు వివిధ ప్రక్రియలు కలిపి మొత్తం ఆరు గంటలపాటు గ్రహణం కొనసాగనున్నది. గ్రహణం మన దేశంలో శుక్రవారం (27వ తేదీ) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం(28వ తేదీ) తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల మధ్య గ్రహణం ఉచ్ఛదశలో ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments