కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చు.. సుప్రీం కోర్టు

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:29 IST)
దేశంలో కరోనా సంక్షోభంపై సుప్రీంకోర్టులో సుమోటోగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరే.. అంతేగాకుండా.. కరోనా పాజిటివ్ రిపోర్టు లేకపోయినా..రోగిని చేర్చుకోమని ఏ ఆసుపత్రి నిరాకరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రులు నడుచుకోవాలని సూచించింది.
 
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడెంచల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల సంఖ్య ఉందని.. ఒక్క విడతలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయకపోతున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
భారతదేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని రోగులకు కొంత ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఎందుకంటే పలు రాష్ట్రాలు..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments