Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీప్రీత్ సింగ్ ఆ రోజంతా ఏడుస్తూనే వున్నది.. ఆహారపానీయాలు ముట్టుకోలేదు

డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు శిక్షపడే ముందే రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌కు చెందిన బంధువు తెలిపారు. డేరా బాబా గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత దత్త పుత్రిక హనీప్రీత్ పరారీల

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:29 IST)
డేరా బాబా గుర్మీత్ సింగ్‌కు శిక్షపడే ముందే రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌కు చెందిన బంధువు తెలిపారు. డేరా బాబా గుర్మీత్‌కు శిక్షపడిన తర్వాత దత్త పుత్రిక హనీప్రీత్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్‌ను తప్పించేందుకు హనీప్రీత్ యత్నించిందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ఇంకా హనీప్రీత్ సింగ్‌పై లుకౌట్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె బంధువు ఓ కీలక విషయాన్ని తెలిపారు. 
 
గుర్మీత్‌కు శిక్ష పడే ముందు రోజు హనీప్రీత్ తమ ఇంట్లో గడిపిందని ఓ బంధువు చెప్పారు. ఆగస్టు 28న ఆమె తమ ఇంట్లో ఉందని... ఆ మరుసటి రోజు వెళ్లిపోయిందని చెప్పారు. ఆ రోజంతా హనీప్రీత్ ఆహారపానీయాలను కూడా ముట్టుకోలేదని వెల్లడించారు. చాలా టెన్షన్‌గా గడిపిందని.. రాత్రంతా ఏడుస్తూనే వుందని తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. డేరా బాబా రామ్ రహీం సింగ్‌కు చెందిన డేరా సచ్చా సౌదాకు రూ.74.96 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నట్లు హర్యానా ప్రభుత్వం నిర్థారించింది. వేర్వేరు బ్యాంకులకు చెందిన పొదుపు, టెర్మ్ డిపాజిట్ ఖాతాల్లో ఈ సొమ్ము ఉన్నట్లు పేర్కొంది. వీటిలో రామ్ రహీం వ్యక్తిగత ఖాతాలు 12 ఉన్నట్లు, ఆయన పేరు మీద రూ.7.72 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ పేరు మీద 6 బ్యాంకు ఖాతాల్లో రూ. 1 కోటికిపైగా ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments