Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ మామూలోడు కాదు... సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపి చంపొచ్చు.. దావూద్ భయం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బకు అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వణికిపోతున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన భద్రతను 50 శాతం మేరకు పెంచుకున్నారు. ముఖ్యంగా అక‌స్మికంగా జ‌రిగే ప

మోడీ మామూలోడు కాదు... సర్జికల్ స్ట్రైక్స్‌ జరిపి చంపొచ్చు.. దావూద్ భయం
, గురువారం, 21 సెప్టెంబరు 2017 (16:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దెబ్బకు అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వణికిపోతున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన భద్రతను 50 శాతం మేరకు పెంచుకున్నారు. ముఖ్యంగా అక‌స్మికంగా జ‌రిగే పోలీసుల దాడులను ఎదుర్కోవ‌డానికి దావూద్ నాలుగు సార్లు ర‌క్ష‌ణ స్థావ‌రాల‌ను మార్చాడ‌ని ఇటీవ‌ల పోలీసుల చేతికి చిక్కిన అత‌ని త‌మ్ముడు ఇక్బాల్ కాస్క‌ర్ బహిర్గతం చేశాడు. 
 
అంతేకాకుండా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై మోడీ సర్కారు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినప్పటి నుంచి దావూద్‌కు భయం పట్టుకుందట. మోడీ మామూలోడు కాదు.. తన స్థావరంపై ఏ క్షణమైనా సర్జికల్ స్ట్రైక్స్ జరిపి హతమార్చవచ్చని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. అందుకే తన భద్రతను మరింతగా పెంచుకున్నట్టు ఇక్బాల్ చెపుతున్నాడు. 
 
కాగా, ప్ర‌స్తుతం పాకిస్థాన్ నుంచి కార్యాక‌లాపాలు సాగిస్తున్న దావూద్‌, న‌రేంద్ర‌ మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి చాలా స్థావ‌రాలు మారిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో కాస్క‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. ఎన్ని స్థావ‌రాలు మారినా కుటుంబంతో దావూద్ ఎప్పుడూ ట‌చ్‌లోనే ఉంటాడ‌ని, కాకపోతే ఫోన్లో మాత్రం మాట్లాడేవాడు కాద‌ని కాస్క‌ర్ తెలిపాడు. దావూద్ అక్ర‌మ వ్యాపారాల గురించి కూడా కాస్క‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. 
 
కాగా, బీజేపీ అగ్రనేతలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారన్నారు. స్వయం నిర్ణయంతోనే దావూద్ భారత్‌కు తిరిగి రావడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పిన రాజ్‌ఠాక్రే.. తమ వల్లే దావూద్ ఇండియాకు వచ్చాడని ప్రచారం చేసుకోవాలని బీజేపీ చూస్తోందని వ్యాఖ్యానించారు. 
 
గురువారం ముంబైలో తన ఫేస్‌బుక్ పేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌ఠాక్రే.. దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితి సరిగాలేనట్లు పలు నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తన చివరి రోజులను స్వదేశమైన భారత్‌లో గడపాలని దావూద్ ఆకాంక్షించినట్లు తెలిసిందని రాజ్‌ఠాక్రే చెప్పారు. భారత్‌కు తిరిగొచ్చేందుకు దావూద్, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. 
 
కాగా, భారత్‌కు తిరిగిరావాలనే ఆకాంక్ష దావూద్‌దే అయినప్పటికీ.. మోడీ ప్రభుత్వం మాత్రం ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. 'ఒకవేళ దావూద్ తిరిగి భారత్‌కు వచ్చినట్లయితే.. ఏళ్ల తరబడి కాంగ్రెస్ చేయలేని పనిని తాము చేశామని, దావూద్‌ను భారత్‌కు తీసుకువచ్చామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటారు' అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినకరన్ వర్గానికి షాక్... ఎమ్మెల్యేపై ఇళ్ళపై ఐటీ దాడులు