Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఠాగూర్
ఆదివారం, 6 జులై 2025 (17:22 IST)
హనీమూన్ ట్రిప్ పేరుతో ఓ కొత్త జంటకు ఓ ముఠా కుచ్చుటోపీ పెట్టింది. యూరప్‌లో తమ శోభనం రాత్రిని జరుపుకోవాలన్న యువజంట ఆశలను ఓ ట్రావెల్ ఏజెన్సీ చిదిమేసింది. వారి నుంచి ఏకంగా రూ.7.60 లక్షలు వసూలు చేసి కుచ్చటోపీ పెట్టింది. పెళ్లికి ముందు మూడు రోజుల ముందు ట్రిప్ రద్దు చేసి నిలువునా ముంచేసింది. కోల్‌కతాలోని న్యూ అలీపూర్‌కు చెందిన ఈ జంటకు ఎదురైన ఈ చేదు అనుభవం, ట్రావెల్ ఏజెన్సీల మోసాలకు అద్దం పడుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ యూరప్ హనీమూన్ ట్రిప్ కోసం సర్వే పార్క్ తూర్పు జాదవ్ పూర్ ప్రాంతంలోని ఒక ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పలు దఫాలుగా రూ.7.6 లక్షల మేరకు వసూలు చేశారు. ఈ మొత్తాన్ని తమ బ్యాంకు ఖాతా నుంచే ట్రావెల్ ఏజెన్సీకి బదిలీ చేశారు. 
 
తమ అనుకున్న ప్లాన్ ప్రకారం మే 14వ తేదీన వారి ప్రయాణం ప్రారంభంకావాల్సివుండగా, పెళ్ళికి కేవలం మూడు రోజులు ఉందనగా ట్రిప్ రద్దు చేస్తున్నట్టు ఏజెన్సీ నుంచి వారికి సందేశం వచ్చింది. వీసా దరఖాస్తు కోసం తాము అడిగిన విమాన టిక్కెట్లు, హోటల్ వోచర్లకు బదులుగా కన్ఫర్మ్ కానీ నకిలీ బుకింగ్స్ ఇచ్చారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ మోసంపై నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఏజెన్సీ యజమానులపై చీటింగ్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మబలికిన ఏజెన్సీ యజమానులు 45 రోజుల్లో నగదు చెల్లిస్తామని చెబుతూ జూన్ 27వ తేదీ నాటికి రూ.3.8 లక్షలు చొప్పు రెండు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. అయితే, ఈ ఏజెన్సీ ఇలాగే మరికొందరిని మోసం చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి మోసాలపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచన చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments