Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

Advertiesment
crime

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (12:16 IST)
కోల్‌కతా నగరంలోని న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు వస్తున్నాయి. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా గంటల తరబడి కాలేజీ ప్రాంగణంలోనే గడిపినట్టు తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి స్నేహితులు తమ పైశాచికత్వానికి చాటుకున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు జూన్ 25వ తేదీన ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత నిందితులు ముగ్గురూ కొన్ని గంటల పాటు నిందితులు కాలేజీలోని సెక్యూరిటీ గార్డు గదిలోనే ఉన్నారు. అక్కడే మద్యం తాగి ఆపై ఈఎం బైపాస్‌లోని ఓ ధాబాకు వెళ్లి భోజనం చేశారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని సెక్యురిటీ గార్డు పినాకి బెనర్జీని బెదిరించి, మరుసటి రోజు ఉదయం తమ ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. 
 
పరిస్థితి తీవ్రతను గ్రహించిన మనోజిత్ మిశ్రా జూన్ 26వ తనకు గతంలో సాయం చేసిన దేశప్రియ పార్క్‌లోని ఓ పలుకుబడిగల వ్యక్తిని సంప్రదించాడు. అయితే, కేసు తీవ్రతను గమనించిన ఆ వ్యక్తి సాయం చేయడానికి నిరాకరించినట్టు పోలీసులు వెల్లడించారు. తనను కాపాడే వారి కోసం మనోజిత్, రాష్ బిహారీ, గరియాహత్, ఫెర్న్ రోడ్ వంటి నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లినట్టు మొబైల్ టవర్ డేటా ఆధారంగా గుర్తించామని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్