Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయుధ బలగాల సిబ్బంది సెలవులపై నివేదిక కోరిన హోంశాఖ

Webdunia
బుధవారం, 21 జులై 2021 (19:38 IST)
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల సాయుధ బలగాల సిబ్బందికి ఏడాదికి 100 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవులు మంజూరు చేయాలన్న ప్రతిపాదన అమలుపై హోంమంత్రిత్వ శాఖ నివేదిక కోరింది.

తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సమస్యాత్మక భూభాగాల్లో విధులు నిర్వహించే సాయుధ సిబ్బందికి తగిన విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో ఏడాదికి 100 రోజుల సెలవులు మంజూరు చేయాలని 2019 అక్టోబరులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రతిపాదించారు.

దీనిని అమలు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఆయా విభాగాలను హోంశాఖ తాజాగా ఆదేశించింది.

దాదాపు 10 లక్షల సిబ్బందితో కూడిన కేంద్ర సాయుధ పోలీస్‌ బలగాల(సీఏపీఎఫ్‌) పరిధిలోకి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌ వస్తాయి. వీటిలో రెండు విభాగాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇప్పటికి సిద్ధమైనట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samyukta :హెల్తీ బాడీ అంటే స‌రైన మ‌జిల్స్ ఉండాలని ఇప్పుడు తెలుస్తుంది : సంయుక్త మీనన్

Raviteja: మారెమ్మ నుంచి హీరో మాధవ్ స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

Sudheer : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధర నుంచి అప్ డేట్

అప్పుడు బాత్రూంలో కూర్చొని ఏడ్చా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు: దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాసేస్తున్నారు : నటి మీనా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

తర్వాతి కథనం
Show comments