Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 పాకిస్థాన్ ఎన్నికల్లో హిందూ మహిళ.. ఆమె గురించి?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (12:07 IST)
పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 2024లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయబోతోంది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బునెర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు హిందూ మహిళ సవిరా ప్రకాష్ నామినేషన్ దాఖలు చేశారు. మీడియా నివేదికల ప్రకారం, ఆమె బునెర్ జిల్లాలోని PK-25 జనరల్ సీటుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) తరపున అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించింది.
 
సవీరా ప్రకాష్ తన తండ్రి ఓం ప్రకాష్ అడుగుజాడల్లో నడుస్తోంది. ఇటీవలే వైద్యుడిగా పదవీ విరమణ చేసిన ఓం ప్రకాష్ గత 35 ఏళ్లుగా పీపీపీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. దీంతో తండ్రిలా ప్రజాసేవ చేయాలని సావీరా భావిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌ని ఆమె ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం బునెర్ జిల్లాలో పోటీ చేస్తున్న మొదటి మహిళ సవీరా ప్రకాష్ అని స్థానిక రాజకీయ నాయకుడు సలీం ఖాన్ పేర్కొన్నారు.
 
సవీరా ప్రకాష్ 2022లో అబోటాబాద్‌లోని ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె బునర్ జిల్లా పిపిపి మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా చురుకుగా పని చేస్తున్నారు. 
 
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. మహిళా సాధికారత, భద్రత, మహిళల హక్కుల కోసం ఆమె తన స్వరం పెంచుతున్నారు. అభివృద్ధిలో మహిళలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, అణచివేతకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పింది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో 16వ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8, 2024న జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments