Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత ర్యాంకు ఎంత?

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (11:10 IST)
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌ పోర్టుల జాబితాలో భారత్ ర్యాంకు పతనమైంది. గత యేడాదితో పోల్చితే ఈ దఫా భారత్ పాస్‌పోర్టు ర్యాంకు ఒక ర్యాంకు పతనమై 84 నుంచి 85కు చేరింది. తాజాగా ప్రఖ్యాత హెన్రీ పాస్ పోర్టు ఇండెక్స్-2024 జాబితా వెల్లడైంది. ఇందులో భారత్ ర్యాంకు పడిపోయి కనిపించింది. 
 
ఎందుకంటే... గతేడాది భారత్ పాస్ పోర్టుతో 60 దేశాలకు వీసాతో పని లేకుండా వెళ్లే వీలుండేది. ఈ ఏడాది ఆ సంఖ్య 62 దేశాలకు పెరిగినప్పటికీ, ర్యాంకింగ్స్‌లో భారత స్థానం పతనమైంది. భారత పర్యాటకులు వీసా లేకుండానే రావొచ్చంటూ గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాలు కూడా ప్రకటించాయి. ఇక, హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్- 2024 జాబితాలో ఫ్రాన్స్ నెంబర్ వన్‌గా నిలిచింది. ఫ్రాన్స్ పాస్ పోర్టు ఉంటే 194 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కూడా పై వరుసలో ఉన్నాయి.
 
అదేసమయంలో, హెన్రీ పాస్ పోర్ట్ ఇండెక్స్ జాబితాలో పాకిస్థాన్ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. గతేడాది పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా, ఇప్పుడూ అదే స్థానంలో ఉంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ 101 నుంచి 102వ ర్యాంకుకు పడిపోయింది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే... ఇటీవల భారతదేశంతో సై అంటే సై అంటున్న మాల్దీవులు హెన్రీ పాస్ పోర్టు జాబితాలో 58వ ర్యాంకులో కొనసాగుతోంది. మాల్దీవుల పాస్ పోర్టుతో 96 దేశాలకు వీసా లేకుండా నిరభ్యంతరంగా వెళ్లిరావొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments