Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పైరును కోస్తూ హేమమాలిని ఎన్నికల ప్రచారం

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:43 IST)
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అనేక మంది ప్రముఖులు... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా వివిధ రకాల వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ నటి హేమమాలిని ఒకరి. ఈమె భారతీయ జనతా పార్టీ తరపున మధుర లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. 
 
ఈమె తన ఎన్నికల ప్రచారాన్ని మధురలోని గోవర్ధన్‌ క్షేత్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న గోధుమ పొలంలోకి వెళ్లిన హేమమాలిని కొడవలి చేతబట్టి మిగతా మహిళల మాదిరిగా ఆ పేరును కోశారు. దీన్ని ఆమె ట్వీట్ చేశారు. "గోవర్ధన్‌ క్షేత్ర నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాను. ఇక్కడి మహిళలతో పొలాల్లో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నా"  అని హేమమాలిని ట్వీట్‌ చేశారు.
 
పైగా, తనను ఇక్కడి ప్రజలు అమితంగా స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్విస్తున్నట్టు చెప్పారు. మధుర ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశానని చెప్పారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments