20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. భారత వాతావరణ శాఖ హెచ్చరిక

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:57 IST)
రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో. రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. 
 
అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
 
ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నెల 18, 19తేదీల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురవవచ్చని తెలిపారు. 
 
అల్పపీడన ప్రభావం దక్షిణ తూర్పు ద్వీపకల్పంపై చూపిస్తుందని.. దీనివల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు వాన ముప్పు తప్పదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలపైనా అల్పపీడనం ఎఫెక్ట్‌ చూపించనుంది. 
 
ముఖ్యంగా ఉత్తర తెలంగాణపై అల్పపీడనం ఆవరించింది. దీంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వరుణుడి ఉగ్రరూపంతో కేరళ అతలాకుతలం అవుతోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments