హిమాలయపర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అపారనష్టం వాటిల్లుతుంది. ఈ వర్షల కారణంగా ఏర్పడిన వరదల వల్ల ఆరుగురు మృత్యువాతపడ్డారు.
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు, కాన్పూర్‌కు చెందిన పర్యాటకుడితో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. భారీ వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో.. నైనిటాల్‌కు రాకపోకలు ఆగిపోయాయి.
కేదర్‌నాథ్ టెంపుల్‌కు వెళ్లి వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. 55 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉండటంతో అతన్ని స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు.
నందాకిని రివర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బద్రీనాథ్ నేషనల్ హైవేకు సమీపంలోని లాంబగడ్ నల్లాహ్ వద్ద వరదలో చిక్కుకున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.