Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రి అమిత్ షా తనయుడిని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ!

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (10:27 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడుగా జై షా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. ఈ బాధ్యతలను వచ్చే డిసెంబరు నెల ఒకటో తేదీన చేపట్టనున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, జై షాపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
జై షా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్‌లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అనంతనాగ్‌లో నిర్వహించిన ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించి వీడియోను కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
"ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారు. అమిత్ షా కుమారుడు జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్ పట్టుకోలేదు. కానీ, ఆయన మాత్రం క్రికెట్‌కు ఇన్‌చార్జ్‌గా ఉంటూ, అంతర్జాతీయ క్రికెట్‌నే శాసించే స్థానంలో ఉన్నారు" అంటూ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments