Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ బాలీవుడ్ స్టార్ హీరోల ఆస్తులు విలువ ఎంత?

Advertiesment
sharukh khan

ఠాగూర్

, శుక్రవారం, 30 ఆగస్టు 2024 (11:59 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో పలువురు హీరోలు అగ్రహీరోలుగా చెలామణి అవుతున్నారు. వీరిలో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ తదితరులు ఉన్నారు. అయితే, ఈ బాలీవుడ్ హీరోల్లో షారూక్ ఖాన్ అత్యంత సంపన్నుడుగా తేలారు. ఈయన రూ.7300 కోట్ల నిరక ఆస్తితో అత్యధిక నిరక ఆస్తులు కలిగిన బాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో హీరోయిన్ జూహీ చావ్లా రూ.4600 కోట్లతో ఉన్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ రూ.1600 కోట్లు, హృతిక్ రోషన్ ఆస్తి రూ.2000 కోట్లతో ఉన్నట్టు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. 
 
సినిమాల్లో నటన, సినిమాల నిర్మాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో పాటు ఇతర మార్గాల్లోనూ షారూక్ భారీగా ఆదాయాన్ని అర్జిస్తున్నట్టు వెల్లడించింది. అతడి సొంత నిర్మాణ సంస్థ రెడ్ 'చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్' పలు బ్లాక్ బాస్టర్ సినిమాలు నిర్మించింది. ఇందులో షారుఖ్ నటించిన 'పఠాన్', 'జవాన్'తో పాటు అనేక హిట్ మూవీస్ ఉన్నాయి. బాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులు, సేవలకు షారూక్ ప్రచారం చేస్తున్నారు. అతడి వద్ద ఇంకా అనే కంపెనీలు క్యూ కడుతున్నాయి. షారుఖ్ పాపులారిటీ, సోషల్ మీడియా ఫాలోయింగ్ దృష్ట్యా మార్కెట్లోకి చొచ్చుకెళ్లాలంటే షారుఖ్ ప్రచారం చేయించుకోవడం లాభదాయకమని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
 
అలాగే, వినోదం, క్రీడా రంగంలో పెట్టుబడులు పెడుతున్న జూహీ చావ్లా రూ.4,600 కోట్ల నికర సంపదతో రెండవ సంపన్న బాలీవుడ్ స్టార్‌గా నిలిచారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ తెలిపింది. రూ.2000 కోట్ల నికర ఆస్తులతో నటుడు హృతిక్ రోషన్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. సినిమాల్లో నటనతో పాటు ఫిట్నెస్ బ్రాండ్ కంపెనీ హెర్ఆర్ఎస్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, అతడి కుటుంబ ఆస్తి విలువ రూ.1,600 కోట్లుగా ఉంది. ఆ తర్వాత నిర్మాత కరణ్ జోహార్ నికర ఆస్తి విలువ రూ.1,400 కోట్లు అని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌కు చేరిన జైత్వానీ కాదంబరి.. పోలీసుల సెక్యూరిటీతో విజయవాడకు..