Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆపద్బాంధవుడు' సోనుసూద్‌కు మహారాష్ట్ర సర్కారు నోటీసులు.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (13:52 IST)
కరోనా కష్టకాలంలో లక్షలాది మందికి ఆపద్బాంధవుడుగా మారిన వెండితెర విలన్, నిజజీవితంలో హీరోగా ఉన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్‌కు ముంబై హైకోర్టు ఆదేశం మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. భారీ మొత్తంలో మందులు కొనుగోలు చేసిన వ్యవహారంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. 
 
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో అనేక మంది సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు వివిధ రకాలైన సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. వీటిపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టి, ఈ మందులు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. సెలబ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక్షన్లు ఎలా వస్తున్నాయో వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్‌పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు గుర్తు చేసింది. 
 
ప్రజలకు మంచి చేయాలన్న వారి ఆలోచన మంచిదే, కానీ కేవలం కేంద్రం ప్రభుత్వానికి మాత్రమే అథారిటీ ఉన్న ఈ కోవిడ్ డ్రగ్స్ వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. ఇందులో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? లేదా అనధికారికంగా మందులు సమకూర్చుకుంటున్నారా? అన్నది విచారణ జరిపి తేల్చాలన్నారు.
 
కాగా, ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, సోనూసూద్ చారిటీ ఫౌండేషన్, ఇతర వ్యక్తులను నోటీసులు జారీ చేసింది. కొందరు ఉత్పత్తి కేంద్రాల నుంచి మందులు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు దాతృత్వంతో డొనేట్ చేస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మందులు వారి దగ్గరికి ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. దీనిపై క్లారిటీకావాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments