Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్షణంలో నిరుద్యోగికి ఉద్యోగం తీసిచ్చిన సోనూసూద్

Advertiesment
క్షణంలో నిరుద్యోగికి ఉద్యోగం తీసిచ్చిన సోనూసూద్
, మంగళవారం, 25 మే 2021 (18:52 IST)
సోనూసూద్. తెలుగు సినిమాల్లో విలన్. తెలుగు ప్రేక్షకులందరూ విలన్‌గానే చూశారు. కానీ కరోనా కారణంగా సోనూసూద్ లోని విలన్ కన్నా హీరో బయటపడ్డాడు. సొంతూళ్ళకు వెళ్ళలేని స్థితిలో ఉన్న వలసకూలీలను స్వంత స్థలాలకు పంపించాడు. అంతేకాదు కరోనా రోగుల కోసం ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడానికి సిద్థమయ్యాడు.
 
చిత్తూరు జిల్లాలో రైతు కష్టం తెలుసుకుని అతనికి ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇలా తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. అయితే ఈరోజు ఉదయం కూడా సోనూసూద్ తన ఇంటి దగ్గరకు వచ్చిన ఒక నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం తీసిచ్చాడు. క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది.
 
ముంబైలోని యమున నగర్‌లో ఉన్న సోనూసూద్ అపార్టుమెంటు దగ్గరకు ఒక తల్లి తన కొడుకును వెంట పెట్టుకుని వచ్చింది. తన కుమారుడు బాగా చదువుకున్నాడని ఉద్యోగం కావాలంటూ గేటు దగ్గరే చాలాసేపు నిలబడింది. విషయం తెలుసుకున్న సోనూసూద్ వెంటనే కిందకు వచ్చాడు.
 
ఆ యువకుడితో మాట్లాడాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. మా కుటుంబ సభ్యులను పోషించలేకపోతున్నానంటూ ఆవేదనతో చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్ ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. తానొక యువకుడిని పంపిస్తున్నానని.. ఉద్యోగం ఇవ్వాలన్నాడు. పంపమని అతను చెప్పాడు. దీంతో ఆ యువకుడితో పాటు అతని తల్లి ఆనందానికి అవధుల్లేవు. సోనూసూద్‌కు కన్నీటి పర్యంతమవుతూ ఇద్దరూ కృతజ్ఙతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా రిలీజ్‌చేసిన `క్యాబ్‌స్టోరీస్` ట్రైల‌ర్‌