Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేసిన వ్యాపారి... ఎక్కడ?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:45 IST)
ఓ వ్యాపారి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. ఓ మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేశాడు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు కొందరు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పాదాచారులతో పాటు.. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారాయి. దీంతో ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇలానే దుకాణాలు ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు. 
 
ఈ ఘటనలో ఆమె మూడు వేళ్లు తెగిపోయాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఏసీపీతోపాటే ఉన్న సెక్యూరిటీగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు అమర్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments