Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా: అత్యాచారం.. ప్రతిఘటించిందని కదిలే రైలు నుంచి నెట్టేసిన దుండగులు

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (19:56 IST)
మహిళలపై అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా హర్యానాలోని ఫతేబాద్‌లో దారుణ ఘటన జరిగింది. తోహనా పట్టణంలో మరికొద్ది నిముషాల్లో రైలు చేరనుంది. ఇంతలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోహ్‌తక్‌లో ఒక మహిళ తన కూతురుతో కలిసి ఉద్యోగం చేస్తుంది. ఆమె తోహానాలో ఉంటున్న భర్త దగ్గరకు వెళ్లేందుకు రైలు ఎక్కింది. 
 
మరికొన్ని నిముషాల్లో రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుతుందనగా షాకింగ్ ఘటన జరిగింది. ఆ భోగీలో మహిళ తన బిడ్డతో కలిసి ఉంది. అదే బోగీలో వున్న కొంతమంది దుండగులు మహిళపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను ట్రైన్ నుంచి బైటకు తోసేశారు. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది
 
ఈ క్రమంలో నిందితుడు కూడా రైలు నుంచి బయటకు దూకేశాడు. రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకోగానే బాధితురాలి భర్త.. తన భార్య పిల్లల కోసం వెతుకుతున్నాడు. కోచ్‌లో తన కుమార్తె ఏడుస్తూ కన్పించింది. దీంతో బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. 
 
ఈ క్రమంలో.. అతను కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ గాయపడిన ఒక నిందితుడు సందీప్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసులను రంగంలోనికి దింపి, విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments