Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వివాహేతర సంబంధం: ప్రియుడిని సజీవంగా సమాధి చేసిన భర్త

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (10:14 IST)
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో ఒక యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టిన ఘటన హర్యానా రాష్ట్రంలో చక్రిదాద్రిలో వెలుగులోకి వచ్చింది. మహిళ భర్త.. యోగా టీచర్‌ను ఏడు అడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్శిటీలో యోగా టీచర్‌. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24వ జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. డిసెంబరు 24వ తేదీన జగదీశ్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవనంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్బంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్దీప్‌లను పోలీసులను అరెస్ట్ చేశారు. 
 
విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments