Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికాని ప్రసాదులకు త్వరలో పెన్షన్... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (10:16 IST)
హీరో వెంకటేష్ నటించిన చిత్రం 'మల్లీశ్వరి'. ఈ చిత్రంలో హీరో పేరు ప్రసాద్. ఎంతకీ వివాహం కాకపోవడంతో హీరోను ప్రతి ఒక్కరూ పెళ్లికాని ప్రసాద్ అని పిలుస్తుంటారు. అప్పటి నుంచి ఈ పదం వాడుకలో బాగా ప్రాచూర్యమైపోయింది. ఇపుడు అలాంటి పెళ్లికాని ప్రసాద్‌లకు పింఛన్ ఇవ్వనున్నారు. ఈ వింత నిర్ణయం తీసుకుంది బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వం. పెళ్లికాని 45 - 60 యేళ్ల మధ్య ఉన్న వారికి పింఛను ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఈ పథకం అమలుపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కర్నాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎ ఖట్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 60 యేళ్ల పెళ్లికాని వ్యక్తి మాట్లాడుతూ పింఛను దరఖాస్తు విషయంలో తాను సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. 
 
దీనికి సీఎం ఖట్టర్ సమాధానమిస్తూ, '45 యేళ్ల పైబడిన వివాహం కాని మహిళలు, పురుషులకు నెలవారీ పింఛన్ ఇచ్చేలా కొత్త పథకాన్ని నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం' అని చెప్పారు. 
 
కాకినాడ కార్తికేయ సొసైటీలో భారీ స్కామ్ 
 
కాకినాడలోని కార్తికేయ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో భారీ స్కామ్ జరిగింది. డిపాజిట్లకు అధిక వడ్డీలు చెల్లిస్తామని పొదుపరుల నుంచి రూ.కోట్లలో సేకరించాక నిలువునా ముంచేసింది. వసూలు చేసిన మొత్తాన్ని చిట్టాల్లో నమోదు చేయకపోవడం, నకిలీ డిపాజిట్లతో రుణాల మంజూరు, బినామీ రుణాలతో నిధులు సొంతానికి వాడుకోవడం వంటి అతిక్రమణలతో ఏకంగా రూ.21.58 కోట్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ కంపెనీ మోసం వెలుగులోకి రావడంతో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిపిన విచారణలో ఈ మోసం బయటపడింది. సొసైటీ ఛైర్మన్‌, మేనేజర్‌, సభ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో సహకార శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. 
 
దుర్వినియోగమైనట్లు గుర్తించిన రూ.21.58 కోట్ల మొత్తంలో.. రూ.10.05 కోట్లు 226 మంది ఖాతాదారుల నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కింద వసూలు చేశారు. వాటిని చిట్టాలోనూ, సొసైటీ ఖాతా పుస్తకాల్లోగానీ నమోదు చేయలేదు. 
 
బినామీ రుణాల పేరుతో రూ.5.36 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. 269 మంది పేరుతో నకిలీ డిపాజిట్లు సృష్టించి రూ.2.56 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తేల్చారు. వడ్డీతో సహా రికవరీ, క్రిమినల్‌ చర్యలుతీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు జిల్లా సహకార అధికారి బి.కె.దుర్గాప్రసాద్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments