Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:57 IST)
ప్రియురాలిని ఓ ప్రియుడు హతమార్చాడు. అదీ శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కురుక్షేత్రలోని భోలి గ్రామానికి చెందిన పింకీకి రవి అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే రవి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో మూడేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడి మకాంను ఆకాశ్ నగర్‌కు మార్చింది. ఆకాశ్ నగర్‌లో పింకీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. 
 
పింకీకి గంగా సింగ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గంగా సింగ్ మంచి మద్యం ప్రియుడు. గత కొన్ని రోజుల నుంచి పింకీని గంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని ఆమెను హింసిస్తున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పింకీ కూతురు తన సోదరుడికి విషయం చెప్పింది.
 
మొత్తానికి పింకీ ఇంటికి గంగా సింగ్ తన భార్యతో కలిసి ఆగస్టు 8న వచ్చాడు. ఆమెకు శీతల పానీయాల్లో విష పదార్థం కలిపి ఇచ్చారు. ఆమె ఆ పానీయాన్ని సేవించిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పింకీ కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments