Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమన్ నగరంలో బాంబు పేలుళ్లు - ద్విచక్రవాహనంలో ఐఈడీ అమర్చి...

Pakistan
Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:35 IST)
పాకిస్థాన్‌ దేశంలో మరోమారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దేశంలోని చమన్ నగరంలోని హజి నిడా మార్కెట్‌లో ఈ పేలుళ్లు సోమవారం జరిగాయి. నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. 
 
నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్‌కు పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తా సంస్థ వెల్లడించింది.
 
ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో నిర్మాణంలో ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. అయితే, ఈ పేలుళ్ళకు ఎవరు పాల్పడ్డారో తెలియాల్సివుంది.
 
మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో బలూచిస్తాన్‌లో దాడులు పెరిగిపోయాయి. జూలై 21న టర్బాట్ బజార్‌లో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, మరికొంతమంది గాయపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments