Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (10:43 IST)
విడాకులు తీసుకున్న కుమార్తెను మేళతాళాలతో ఊరేగింపుగా ఓ కన్నతండ్రి పుట్టింటికి తీసుకొచ్చాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి గతేడాది ఏప్రిల్ నెలలో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని ప్రేమ్ గుప్తా చెప్పారు. సచిన్‌కు అంతకుముందే వివాహమైనట్టు తెలిసిందని, అయినప్పటికీ అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి తెలిపారు. 
 
కానీ, వేధింపులు ఎక్కువయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండటం సాధ్యం కాదని అనుకున్నట్లు వివరించారు. అందుకే వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాన్ని సాక్షి తండ్రి, ఆమె కుటుంబ సభ్యులు స్వాగతించారు. 
 
ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు. ఆమెను మేళతాళాలు, బాణసంచా సందడి మధ్య పుట్టింటికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ నెల 15న జరిగిన ఈ ఊరేగింపు వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 
 
కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని ప్రేమ్ గుప్తా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments