Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ... నుదుటిపై గన్ పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కింది..

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో వాట్సాప్ చాట్ చేస్తూ లోడింగ్ చేసిన గన్‌ను నుదుటిపై పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కింది. అంతే.. ఒక్కసారిగా బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి బయటకువచ్చింది. ఈ

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (08:50 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో వాట్సాప్ చాట్ చేస్తూ లోడింగ్ చేసిన గన్‌ను నుదుటిపై పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కింది. అంతే.. ఒక్కసారిగా బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి బయటకువచ్చింది. ఈ ఘటన గ్వాలియర్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
గ్వాలియర్ నగరంలోని నారాయణ్ విహార్ కాలనీకి చెందిన ఆర్మీ మాజీ సుబేదార్ అర్వింద్ యాదవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అర్వింద్ తన భార్యతో కలిసి చిత్రకూట్ గ్రామానికి వ్యక్తిగత పనులపై వెళ్లాడు. అతని పెద్ద కుమార్తె కరిష్మా యాదవ్ (21) ఇంట్లో ఉన్నది. దీంతో ఢిల్లీలోని తన స్నేహితుడితో వాట్సాప్ చాట్‌లో నిమగ్నమైంది. 
 
అదేసమయంలో తన తండ్రి తుపాకీ తీసుకొని ఆడుకుంటూ ఈ చాట్ చేయసాగింది. పైగా, గన్ ఫుల్‌లోడ్ చేసివుంది. ఈ విషయం తెలియని కరిష్మా.. గన్‌ను తన నుదుటిపై పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కింది. అంతేక్షణాల్లో తుపాకీలో ఉన్న బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి బయటకు వచ్చేసింది. 
 
ఆసమయంలో సోదరుడు వీధిలో వున్నాడు. ఇంట్లో నుంచి ఏదో పెద్ద శబ్దం రావడంతో ఒక్క పరుగున ఇంట్లోకి వచ్చి చూడగా, అక్క రక్తపు మడుగులో పడివుంది. ఆ వెంటనే ఇతరుల సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, కరిష్మా ఉద్దేశ్యపూర్వకంగా కాల్చుకుని చనిపోయిందా లేదా ప్రేమ వ్యవహారం కారణంగా ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియాల్సి వుంది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments