Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా దత్తపుత్రిక అలియాస్ ప్రియురాలికి బెయిల్...

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (11:51 IST)
డేరా బాబా దత్తపుత్రిక అని చెప్పుకునే ప్రియురాలు హనిప్రీత్ ఇన్సాన్‌కు హర్యానా కోర్టు బెయిల్ మంజూరైంది. అక్టోబరు 2017 నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆమెకు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) రోహిత్ వాట్స్ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.
 
ఆధ్యాత్మిక ముసుగులో ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకున్న గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 
 
అత్యాచారం ఆరోపణలపై రామ్ రహీమ్ సింగ్ దోషిగా తేలిన తర్వాత 2017 ఆగస్టులో హర్యానాలోని పంచకులాలో హింస చెలరేగింది. ఆగస్టు 25వ తేదీన జరిగిన అల్లర్లలో 29 మంది మరణించగా, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఆర్మీని మోహరించి అల్లర్లను అదుపులోకి తెచ్చింది.
 
ఈ కేసులో హనీప్రీత్ ఇన్సాన్ ప్రధాన నిందితురాలు. ఆమెతో పాటు మరో 41 మందిపై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేశారు పోలీసులు. అక్టోబర్‌ 2017లో వారిని అంబాలా జైలుకు తరలించారు. లక్ష రూపాయల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో రెండేళ్ళ తర్వాత ఆమె జైలు నుంచి బయటకురానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments