Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటున్న ఎన్నారై భర్త.. యేడాదిగా శృంగారానికి దూరం..

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:50 IST)
సాధారణంగా ఎన్నారై భర్త అంటే.. ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేస్తారు. కానీ, అలాంటి సంబంధాలే లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతాయి. తాజాగా ఓ ఎన్నారై భర్త.. కట్టుకున్న భార్యతో సంసారం చేసేందుకు అదనపు కట్నం తేవాలంటూ వేధించాడు. అంతేనా... గత యేడాది కాలంగా భార్యతో శృంగారానికి దూరంగా ఉంటున్నాడు. 
 
ఆ వివరాలు.. ఓ ఎన్నారైతో ఓ మహిళకు 2016లో వివాహమైంది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్‌ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు. 
 
దుబాయ్‌ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా బాధితురాలిని వేధింపులకు గురిచేయసాగాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అతంటితో ఊరుకోక భార్యతో కుమార్తెతో బలవంతంగా బీర్‌ తాగించేందుకు ప్రయత్నించేవాడు. 
 
ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్‌ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు.
 
ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్‌ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం