Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు.. మోదీకి షాకిచ్చే నిజం వెలుగులోకి వచ్చిందిగా..?

Advertiesment
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు.. మోదీకి షాకిచ్చే నిజం వెలుగులోకి వచ్చిందిగా..?
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:46 IST)
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో తాజాగా ఓ అంశం తెరపైకి వచ్చింది. 36 విమానాల కొనుగోలుకు సంబంధించిన 2007లో మన్మోహన్ ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే భారత్‌కు 10 విమానాలు అందాయి. మిగిలినవి అందాల్సి ఉంది. ఈ తరుణంలో ఇలాంటి వార్తలు రావడం ఇరు దేశాల ప్రభుత్వాలను ఇరకాటంలో నెడుతోంది. 
 
కాంగ్రెస్ హయాంలో కుదిరిన డీల్‌కి కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచి రిలయన్స్ సంస్థల అధినేత అనిల్ అంబానీకి లబ్ది చేకూరే విధంగా ఒప్పందంలో మార్పులు చేశారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్-భారత్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో మధ్యవర్తులకు భారీగా ముడుపుల రూపంలో బహుమానాలు అందాయని, రాఫెల్ జెట్స్ తయారీదారు దసాల్ట్ ఏవియేషన్ తన రికార్డుల్లో రహస్యంగా పొందుపర్చిన గుట్టు రట్టయిందని ఫ్రాన్స్‌కు చెందిన మీడియాపార్ట్ అనే మీడియా సంస్థ వెల్లడించింది.
 
రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ అయిన దసాల్ట్ ఏవియేషన్ కార్యాలయంలో ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేయగా కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించాయని, 2017నాటి రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాల్లో 'మధ్యవర్తులకు బహుమానాలు' అని పేర్కొంటూ భారీ మొత్తాన్ని లెక్కగా చూపించినట్లు వెల్లడైందని 'మీడియాపార్ట్' కథనంలో పేర్కొన్నారు. 
 
మార్చి 30, 2017 నాటి ఇన్వాయిస్‌లో.. రాఫెల్ జెట్ల 50 డమ్మీ మోడళ్ల తయారీకి 1,017,850 యూరోల విలువైన ఆర్డర్‌లో డెఫ్సిస్‌(గుప్తా సంస్థ)కు 50 శాతం చెల్లించాలని రాసున్నట్లుగా ఏఎఫ్ఏ గుర్తించింది. 
 
అయితే, ఆ చెల్లింపులకు అర్థమేంటని, డబ్బు ఎలా పంపారనడానికి ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారాలను దసాల్ట్ అందించలేకపోయిందని, సంస్థ ఖాతాల్లో ఖర్చును ఖాతాదారులకు బహుమతిగా ఎందుకు రాశారనేదానిపైనా దసాల్ట్ వివరించలేదని ఏఎఫ్ఏ విభాగం నుంచి విశ్వసనీయంగా తెలిసిందని 'మీడియాపార్ట్' కథనంలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టులకు ఏప్రిల్10వ తేదీ వరకే వాక్సినేషన్