Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని నిల్చోబెట్టి పురుడు పోశారు... మోడీ రాష్ట్రంలోనే...

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (16:30 IST)
"బేటీ బచావో.. బేటీ పడావో" అంటూ గొప్పగా ప్రచారం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఓ గర్భిణి పట్ల ఆస్పత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. గర్భిణిని నిలబెట్టి పురుడు పోశాడు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని బనస్కాంథ జిల్లాలో రామి బెన్‌ గౌతంభాయ్‌ ఠాకూర్‌ అనే మహిళ డెలివరీ కోసం తన అత్తతో కలిసి జలోటా ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. 
 
ప్రసూతి గదిలోకి తీసుకెళ్లి పురుడు పోయాల్సిన నర్సు కాస్త.. రామి బెన్‌ను ఎదురుగా ఉన్న ఇనుప రాడ్డు పట్టుకొని నిల్చోమని చెప్పి అలానే పురుడు పోసింది. ప్రసవం అయిన తర్వాత బిడ్డ బయటకు వచ్చాక.. రామి బెన్‌ చీరతోనే నేల మీద పడ్డ రక్తాన్ని తుడిపించింది. ఈ విషయం తెలుసుకున్న రామి బెన్‌ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
అయితే ఇలా నిల్చోబెట్టి ప్రసవం చేయడం ఈ ఆరోగ్య కేంద్రంలో కొత్తేం కాదని.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని ఇదే ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న అనేక మంది మహిళలు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని సీనియర్‌ వైద్యుడొకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments