చిక్కుల్లో కేసీఆర్... హైకోర్టు నోటీసు... సీఎం పోస్ట్ ఊడేనా? ఉండేనా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (16:08 IST)
దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్లో తెరాస అధినేత కేసీఆర్ దూకుడుగా ముందుకెళుతున్నారు. అటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తూ, తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. 
 
అలా ముందుకు దూసుకెళుతున్న కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ దాఖలైంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. 
 
ఆయనపై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్‌లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్‌, ఎన్నికల కమిషన్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో గనుక కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments