Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:25 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా వైరస్ సోకిందా? సీఎంతో పాటు.. మరో ఇద్దరు మంత్రులతో సమావేశమైన తర్వాత ఓ ఎమ్మెల్యేలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ముఖ్యమంత్రితో పాటు.. సీఎం కార్యాలయ సిబ్బంది కూడా హడలిపోతున్నారు. 
 
గుజరాత్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రానా ఖేడావాలాకు కొద్దిరోజులుగా జ్వరం వస్తున్నది. దాంతో ఆయన కరోనా పరీక్షలకు శాంపిల్ ఇచ్చారు. అయినా ఇంటిపట్టున ఉండకుండా బయట తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం దగ్గరకు వెళ్లడమేకాకుండా తర్వాత ఓ మీడియా సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎట్టకేలకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన గాంధీనగర్‌లోని ఎస్వీపీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. 
 
ఆయన ఇంకా ఎంతమందిని కలిశారో తెలియడం లేదు. వారందరినీ వెతికి క్వారంటైన్‌లో ఉంచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ ఉదయం సీఎంతోనూ, ఆరోగ్య, హోంశాఖ మంత్రులతోనూ ఎమ్మెల్యే జరిపిన సమావేశం వీడియోను అధికారులు పరిశీలించగా అందులో పాల్గొన్నవారంతా సామాజిక దూరాన్ని పాటించినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments