కరోనాపై హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్పింది.. మోదీ వేడినీరే తాగుతున్నారట..! (video)

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (17:45 IST)
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆనందంగా, ఆరోగ్యంగా వుండాలంటే.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపు నిచ్చారు. ఆయుష్ మినిస్ట్రీ సూచనలు పాటిద్దామన్నారు. ఆయుష్ మినిస్ట్రీ సూచన మేరకే చాలా రోజుల నుంచి వేడి నీళ్లు తాగుతున్నానని మోదీ వ్యాఖ్యానించారు. 
 
అలాగే తులసీ దళాలను నీటిలో వేసి ఆ నీటిని సేవించడం ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి మాయమవుతుంది. రెండు లేదా మూడు ఆకులను నమలడం ద్వారా.. ఇంకా తులసీ రసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, కిస్ మిస్‌లు ఆహారంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఉసిరికాయను రోజూ ఒకటి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరగడం ద్వారా కరోనాలాంటి వ్యాధులు దరిచేరవు అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. 
 
ఇకపోతే.. ముఖ్యంగా వ్యాయాయం చేయడం, యోగా చేయడం వంటివి మరిచిపోకూడదు. శరీరం ఫిట్‌గా వుంటే అనారోగ్య సమస్యలు అవంతట అవే పటాపంచలవుతాయి. ఒకవేళ చేరినా.. వాటి నుంచి తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజూ కనీసం 30 నిమిషాలపాటు ప్రాణాయామం, ధ్యానం చేయండని ఇటీవల ఆయుష్ మినిస్ట్రీ కూడా సూచించింది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కిడ్నీల ఆరోగ్యానికి ఇదొరక్కటే మార్గం?